Site icon NTV Telugu

Palestine Recognition: ఇజ్రాయెల్‌కు గర్వభంగం.. పాలస్తీనా విషయంలో గట్టి దెబ్బ కొట్టిన నాలుగు దేశాలు..

Palestine Recognition

Palestine Recognition

Palestine Recognition: ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్‌కు నాలుగు దేశాలు గట్టి దెబ్బ కొట్టాయి. ఇంతకీ ఆ దెబ్బ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ నాలుగు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఒక దేశం అయిన బ్రిటన్ తాజాగా సవరించిన మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో ఇజ్రాయెల్‌కు ఆనుకుని ఉన్న పాలస్తీనా ప్రత్యేక దేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్‌పై పాలస్తీనా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వైపు పాలస్తీనా జెండా, మరోవైపు ఇజ్రాయెల్ జెండా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు యూరప్‌లో ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య హైలైట్ కావడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: CM Chandrababu: మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్‌ కావాలి!

24 గంటల్లో 4 దేశాలు..
గడిచిన 24 గంటల్లో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. పాలస్తీనా విషయంలో ఈ నాలుగు దేశాల మద్దతు ఇజ్రాయెల్‌కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన తర్వాత చాలా యూరోపియన్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్వత సభ్యులలో నాలుగు ఇప్పటికే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. కేవలం అమెరికా మాత్రమే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా వ్యతిరేకిస్తోంది. ఈ నాలుగు శాశ్వత సభ్యులతో పాటు 150 కి పైగా దేశాలు పాలస్తీనాను మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లోనే పాలస్తీనాకు సంబంధించిన బిల్లును ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకురావడానికి సౌదీ అరేబియా, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయి.

ప్రత్యేక దేశంగా పాలస్తీనా.. 
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం 1948 నుంచి కొనసాగుతోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పాలస్తీనాలో తన పట్టును క్రమంగా పెంచుకుంటుంది. ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కరించడంతో పాటు, పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా అవరిస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగుస్తుందని సౌదీ అరేబియా చెబుతోంది. ప్రస్తుతం పాలస్తీనాకు ప్రభుత్వం లేదు. హమాస్ పాలస్తీనా పరిపాలనను నియంత్రిస్తోంది.

READ ALSO: PM Modi: జీఎస్టీ తగ్గింపుపై దేశ ప్రజలందరికీ ప్రధాని బహిరంగ లేఖ..

Exit mobile version