Site icon NTV Telugu

UGC: 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించిన UGC.. లిస్ట్ ఇదిగో

Ugc

Ugc

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించింది. UGC చట్టం, 1956లోని సెక్షన్ 13 ప్రకారం తప్పనిసరి సమాచారాన్ని సమర్పించనందుకు, వారి వెబ్‌సైట్‌లలో పబ్లిక్ సమాచారాన్ని అందుబాటులో ఉంచనందుకు విశ్వవిద్యాలయాలపై చర్య తీసుకుందని సబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు డిఫాల్టర్లుగా ప్రకటించారు. గుజరాత్‌లో ఎనిమిది, సిక్కింలో ఐదు, ఉత్తరాఖండ్‌లో నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

Also Read:North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!

UGC డిఫాల్ట్ లేదా తప్పు చేసిన విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసి, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇమెయిల్, ఆన్‌లైన్ సమావేశాల ద్వారా బహుళ రిమైండర్‌లను ఉటంకిస్తూ, రిజిస్ట్రార్ ధృవీకరించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో పాటు తనిఖీ కోసం వివరణాత్మక సమాచారాన్ని సమర్పించాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు UGC తెలిపింది.

పూర్తి చేసిన ఫారమ్‌లు, అటాచ్ మెంట్స్ ను హోమ్ పేజీకి లింక్ చేయడం ద్వారా వారి వెబ్‌సైట్‌లకు అప్‌లోడ్ చేయాలని కూడా వారిని ఆదేశించినట్లు యుజిసి కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు. తద్వారా సమాచారం విద్యార్థులకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. తదనంతరం, ఇమెయిల్, ఆన్‌లైన్ సమావేశాల ద్వారా అనేక రిమైండర్‌లు పంపించారు. మార్గదర్శకాల ప్రకారం, ఉన్నత విద్యా సంస్థలు వాటాదారులకు సమాచారాన్ని అందించడానికి ఆక్టివ్ వెబ్‌సైట్‌లను నిర్వహించాలి.

ఎంపీకి చెందిన ఈ విశ్వవిద్యాలయాలు డిఫాల్టర్ జాబితాలో చేర్చారు

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్
ఆర్యవర్ట్ విశ్వవిద్యాలయం, సెహోర్
డా. ప్రీతి గ్లోబల్ యూనివర్సిటీ, శివపురి
జ్ఞానవీర్ విశ్వవిద్యాలయం, సాగర్
JNCT ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, భోపాల్
LNCT విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, ఇండోర్
మహాకౌశల్ విశ్వవిద్యాలయం, జబల్పూర్
మహర్షి మహేష్ యోగి వేద విశ్వవిద్యాలయం, జబల్పూర్
మానసరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ, సెహోర్
శుభం విశ్వవిద్యాలయం, భోపాల్

గుజరాత్‌లోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు

గాంధీనగర్ విశ్వవిద్యాలయం
జెజి విశ్వవిద్యాలయం
కెఎన్ విశ్వవిద్యాలయం
ఎంకే విశ్వవిద్యాలయం
ప్లాస్టిండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
సురేంద్రనగర్ విశ్వవిద్యాలయం
టీమ్ లీజ్ స్కిల్స్ యూనివర్సిటీ
ట్రాన్స్‌స్టేడియా విశ్వవిద్యాలయం

జాబితాలో సిక్కింలోని ఐదు విశ్వవిద్యాలయాలు

మేధవి నైపుణ్య విశ్వవిద్యాలయం
సిక్కిం ఆల్పైన్ విశ్వవిద్యాలయం
సిక్కిం గ్లోబల్ టెక్నికల్ విశ్వవిద్యాలయం
సిక్కిం అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
సిక్కిం నైపుణ్య విశ్వవిద్యాలయం

Also Read:US Government Shutdown: షట్‌డౌన్ దిశగా యూఎస్ ప్రభుత్వం..పాపం ట్రంప్!

ఉత్తరాఖండ్‌లోని నాలుగు విశ్వవిద్యాలయాలు

మాయా దేవి విశ్వవిద్యాలయం
మైండ్ పవర్ యూనివర్సిటీ
శ్రీమతి మంజీరా దేవి యూనివర్సిటీ
సూరజ్మల్ విశ్వవిద్యాలయం

Exit mobile version