Uttarakhand Crime: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌లో శనివారం ఓ యువకుడిపై గుర్తు తెలియని నేరస్థులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుల్లెట్ యువకుడి ఛాతీకి తగిలింది. స్థానికులు ఈ ఘటన ఇద్దరి మధ్య కక్ష కారణంగానే జరిగిందన్నారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడి భార్యే అతడిని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిందని.. ఇందుకోసం నేరగాళ్లకు రూ.80 వేలు ముట్టజెప్పినట్లు తేలిందన్నారు.
Read Also:Rajasthan: మద్యం తాగుతున్నాడని భర్తపై భార్య వేధింపులు.. చివరకు..
ఈ కాల్పుల ఘటన ఖుర్పియా గ్రామంలో చోటుచేసుకుంది. అదే సమయంలో గాయపడిన యువకుడి పేరు మౌషుమి లాల్. మౌషుమి భార్య చందా సూచనల మేరకు నేరస్థులు ప్లాన్ అమలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 23న యువకుడిని నేరస్థులు కాల్చారు. యువకుడి సోదరుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చందాను విచారిస్తున్నప్పుడు.. ఆమె గంటకో మాట మాట్లాడడంతో అనుమానం మరింత బలపడింది. చివరకు గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. గ్రామానికి చెందిన జితేంద్ర అనే యువకుడిని తాను ప్రేమిస్తున్నానని చందా పోలీసులకు తెలిపింది. ఏడేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. అయితే ఇద్దరి మధ్య భర్త, కుటుంబం అడ్డుగా మారాయి. ఈ కారణంగానే మౌషుమిని చంపేందుకు చందా ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Shruti Haasan: బ్లాక్ ఫ్లవర్ తో మతి పోగొడుతున్న శృతి
దీని తర్వాత ఆమె తన ప్రేమికుడి సహాయంతో చంపేందుకు నేరస్థులను పురమాయించింది. మౌషుమి హత్యకు నేరస్తులు 80 వేలు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు చందా తన ఏటీఎం కార్డును ప్రియుడికి ఇచ్చింది. బుల్లెట్ కారణంగా చందా భర్త మౌషుమి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. గాయం మానడానికి కొన్ని రోజులు పడుతుంది. అతని శరీరం నుంచి బుల్లెట్ తొలగించారు.
