Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సైతం ఆ పార్టీని ఓడగొట్టడానికి ఓ కారణం. ఘోరపరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. తమిళనాడు శాసనసభలో మంగళవారం చర్చాకార్యక్రమంలో ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ మరోసారి తన ‘సనాతన ధర్మ’ వ్యతిరేక గళాన్ని వి వినిపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పాత నినాదాన్ని అసెంబ్లీ వేదికగా పునరుద్ఘాటించారు. “మనుషుల మధ్య దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిందే” అని స్పష్టం చేశారు. అదే సమయంలో సభలో హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
రాజకీయ నాగరికత గురించి ప్రస్తావిస్తూ.. “నిన్న కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు మా నాయకుడితో పాటు ఇతర రాజకీయ నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. అటువంటి రాజకీయ మర్యాదలు ఈ సభలోనూ కొనసాగాలి. మనం అధికార, ప్రతిపక్ష వరుసల్లో వేర్వేరుగా కూర్చున్నప్పటికీ, తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి” అని ఉదయనిధి పిలుపునిచ్చారు. సభలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అయితే, సభలో తమిళనాడు రాష్ట్ర గీతానికి జరిగిన ప్రాధాన్యత విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “వందేమాతరం తర్వాత మన రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గమనిస్తే అక్కడ వందేమాతరం ఆలపించలేదు. కానీ ఇక్కడ మాత్రం దాన్ని ప్లే చేశారు. అక్కడ గవర్నర్ ఎవరో మీకు తెలుసు. ఇలాంటివి మళ్ళీ జరగనివ్వకూడదు. మన తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ రెండో స్థానానికి పడిపోకూడదు” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!