NTV Telugu Site icon

YSRCP: ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మా సోదరుడే.. స్పష్టం చేసిన మాజీ ఎంపీ

Mekapati Rajamohan Reddy

Mekapati Rajamohan Reddy

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్‌ కనిపిస్తోంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. మరోవైపు.. అభ్యర్థులు ఎవరు అనేదానిపై కూడా కొంత క్లారిటీ వస్తుంది.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో సీటు అని స్పష్టం చేశారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు కాకరేపుతుండగా.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు

ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా తన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. ఇక, మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది, త్వరలోనే ప్రకటన కూడా వస్తుందన్న ఆయన.. జలదంకి నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.. త్వరలోనే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తా.. ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు అండగా ఉంటానని వెల్లడించారు.