శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళనకు దిగారు. తమపై దాడి చేసిన సెక్యూరిటీ పై చర్యలు చేపట్టాలని నిరసిస్తూ డి పార్కింగ్ వద్ద బయటాయించి నిరసన చేపట్టారు. దీంతో క్యాబ్ లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్ లను సముదాయించే ప్రయత్నం చేసిన వినకుండా ఎయిర్ పోర్ట్ లో తమకు అన్యాయం జరుగుతుందని ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థను నమ్ముకుని పనిచేస్తుంటే సరైన బుకింగ్ ఇవ్వకపోవడంతో భార్యాపిల్లలను పోషించడం కష్టమౌతుందని తెలిపారు.
Also Read : SSC and Inter Results : తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. వారంలో ఫలితాలు
ఓలా, ఉబర్ సంస్థలు బుకింగ్ ఇచ్చి 40 శాతం వాళ్ళు తీసుకుని 60 శాతం తమకు ఇస్తున్నారని అందులో డిజిల్ పోసుకుని నడపడం కష్టంగా ఉందని వారు తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో ప్రైవేట్ క్యాబ్ లు నడుస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని దీంతో తమ కంటే ప్రైవేట్ కార్లకు బుకింగ్ దొరికి తమకు దొరకక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి అందుకోవాలని అన్నారు. తమపై దాడికి దిగిన సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేదంటే క్యాబ్ లు నడిపేది లేదని వారు అన్నారు. ఓలా, ఉబర్ సంస్థలకు సంబంధించిన ఆఫీసు హైదరాబాద్ లో ఉంది కాబట్టి బుకింగ్ ల విషయం అక్కడే తీర్చుకోవాలని పోలీసులు తెలిపారు.
Also Read : NEET Exam: రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..