Uber driver: జీవితంలో తమ బిడ్డలను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తమ జీవితాన్నే ధారపోస్తుంటారు. అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతుంటారు. వాళ్ల జీవితంలో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే దానిని చూసి మురిసిపోతుంటారు. అందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఓ ఉబర్ ఆటో డ్రైవర్ కూడా అలాగే కష్టపడుతున్నాడు. కష్టం ఏదో పని చేయడం కాదు. తన కూతురును యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం చేయడంలో సాయం చేయడానికి స్వతహాగా ఆయనే ఆటోలో క్రమం తప్పకుండా చదువుతున్నాడు. నిజమేనండి.. ఓ వైపు ఆటో నడుపుతూనే ఫోన్‌లో యూపీఎస్సీ పాఠాలు వింటున్నాడు. అభిజిత్ మూత అనే బ్యాంకింగ్ అనలిస్ట్ తన లింక్డిన్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఉబెర్ ఆటో డ్రైవర్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రకారం.. అభిజిత్ మూత ఉబెర్‌లో ఆటోను బుక్ చేశాడు. రాకేష్ అనే వ్యక్తి అతనిని పికప్ చేసుకోవడానికి వచ్చాడు. అతను యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నాడు. కానీ అభిజిత్ ఆటో ఎక్కిన తర్వాత అతను దానిని ఆపి, నావిగేషన్ విండోను తెరిచాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ యూట్యూబ్‌కి వెళ్లి వీడియోను మళ్లీ కొనసాగించాడు. కాసేపు ఇదంతా గమనిస్తున్న అభిజిత్ ఇదే విషయమై రాకేష్‌ను ఆరా తీశారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కంటెంట్ ఉందని రాకేష్ బదులిచ్చారు. అప్పుడు అతను ఏదైనా పరీక్షలో హాజరు కావాలనుకుంటున్నారా అని అడిగాడు. దీనికి అతను ఇలా బదులిచ్చాడు. లేదు నా కుమార్తె సిద్ధమవుతోందని రాకేష్ చెప్పాడు. తన కూతురికి పరీక్షల కోసం సాయం చేయడానికి తాను ప్రిపేర్ అవుతున్నట్లు ఆటో డ్రైవర్ రాకేష్ బదులిచ్చాడు. ఇది విన్న అభిజిత్‌కు ఆశ్చర్యపోయాడు.
Passenger Attack on Conductor: కండక్టర్ పై ప్రయాణికుడు దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
తాను పదో క్లాస్ వరకు చదువుకున్నానని, కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చదువు మానేసి ఆటో నడపడం మొదలుపెట్టానని, అదే ఇప్పుడు ఇన్‌కం సోర్స్ అయిందని తన స్టోరీ చెప్పాడు ఆటో డ్రైవర్ రాకేష్. అయితే ఇప్పుడు అతను వినే క్లాస్‌లు తన కూతురి కోసమని చెప్పాడు. సాయంత్రం లైబ్రరీ నుంచి కూతురిని తీసుకుని ఇంటికెళ్లి.. అప్పటివరకు ప్రిపేర్ అయిన టాపిక్స్ కూతురితో డిస్కస్ చేస్తాడట. ఈ వీడియో అభిజిత్ లింక్‌డ్‌ఇన్‌లో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌పై పలురకాలుగా స్పందించారు. ఈ పోస్ట్‌ను లక్షా 30 వేల మందికి పైగా లైక్ చేశారు. 1600లకు పైగా కామెంట్లు వచ్చాయి. 1,787 మంది రీపోస్ట్‌లు చేయడం గమనార్హం. చాలా మంది ఉబెర్ డ్రైవర్ ప్రయత్నాలను ప్రశంసించగా.. మరికొందరు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను ఎత్తి చూపారు.