NTV Telugu Site icon

Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!

Whatsapp Image 2024 04 05 At 10.02.00 Am

Whatsapp Image 2024 04 05 At 10.02.00 Am

ఈ మధ్యకాలంలో ఉబర్ సంస్థ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు కిలోమీటర్ల గాను ఉబర్ ఆటోను బుక్ చేసుకోగా అతనికి ఏకంగా 7 కోట్లకు పైగా బిల్లును చూపించి షాక్ గురి చేసింది. ఇకపోతే ఈ విషయం మరువక ముందే బెంగళూరు నగరంలో మరో కస్టమర్ కి ఉబర్ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

Also Read: AC Tickets: మండుతున్న ఎండలు.. ట్రైన్, బస్సుల్లో ఏసీ టికెట్లకు భారీ గిరాకీ!

బెంగళూరు నగరంలో కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణానికి గాను ఉబర్ ఆటో ఏకంగా కోటి రూపాయలకు పైన బిల్ వేసింది. హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీరాజ్ నీలేష్ అనే కస్టమర్ కు ఈ సంఘటన ఎదురయింది. హైదరాబాద్ వాసి శ్రీరాజ్ పని నిమిత్తం బెంగళూరు నగరానికి వెళ్ళగా.. అక్కడ ఉబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. బెంగళూరు నగరంలోని టిన్ ఫ్యాక్టరీ నుండి కోరమంగళ ప్రాంతానికి వెళ్లడానికి ఉబర్ ఆటో బుక్ చేసుకోగా కేవలం 10 కిలోమీటర్ల కు గాను ఏకంగా రూ. 1,03,11,055 ను బిల్ చూపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

Also Read: Shashank Singh: కన్ఫ్యూజిన్‌లో జట్టులోకి వచ్చి ‘పంజాబ్‌’ హీరో అయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్‌?

ఇకపోతే ఈ విషయంపై ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగి ఉంటుందని., సదరు హైదరాబాద్ వాసి గ్రహించి దానిని ఉబర్ కస్టమర్ కేర్ కి తెలపగా.. వారు సరిగా స్పందించలేదు. దాంతో ఈ విషయం సంబంధించి కస్టమర్ శ్రీరాజ్ తన ఆటో రైడ్ ప్రయాణం చేసిన ఆటోను, అలాగే డ్రైవర్ ను, ఫోన్ లో చూపించిన బిల్ ను కూడా చూపిస్తూ ఓ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో ఇంకేముంది ఉబర్ సంస్థ పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చూడాలి మరి బాధితుడికి ఉబర్ సంస్థ కస్టమర్ కు ఇప్పుడైనా ఏ విధంగా సహాయపడుతుందో.