UAE vs NZ T20: టీ20 క్రికెట్లో యూఏఈ సంచలనం.. పెద్ద జట్టుకు భారీ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE Defeated New Zealand for the first time in International Cricket: పసికూన యూఏఈ.. టీ20 క్రికెట్లో పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. రెండో టీ20లో కివీస్‌ను సునాయాసంగా ఓడించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు ఉండగానే గెలిచింది. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీమ్ (55; 29 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా న్యూజిలాండ్‌ను యూఏఈ ఓడించింది.
రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (7), కీపర్ డేన్ క్లీవర్ (0), ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ (1) తక్కువ పరుగ్గులకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ చాడ్ బోవ్స్ 21 రన్స్ చేశాడు. యూఏఈ పేసర్ అయాన్ ఖాన్ చెలరేగడంతో కివీస్ 38 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో చాప్మన్ (63; 46 బంతుల్లో 3×4, 3×6) ఒంటరి పోరాటం చేస్తూ.. కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడికి జేమ్స్ నీశమ్ (21) అండగా నిలిచాడు. అయాన్ ఖాన్ (3/20), జవాదుల్లా (2/16), అలీ నజీర్ (1/25) రాణించారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Also Read: ATM Robbery: ఏటీఎంలోని డబ్బును చోరీకి యత్నించి.. షాక్‌కు గురైన దొంగలు!
లక్ష్య ఛేదనలో యూఏఈకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ డకౌట్ అయ్యాడు. వృత్య అరవింద్ (25) అండతో కెప్టెన్ మహ్మద్ వసీమ్ జట్టును ఆదుకున్నాడు. ఈ జోడి కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. అరవింద్ ఔట్ అయినా అసిఫ్ ఖాన్ (48 నాటౌట్; 29 బంతుల్లో 5×4, 1×6) చెలరేగడంతో యూఏఈ లక్ష్యం దిశగా సాగింది. వసీమ్ పెవిలియన్ చేరినా బాసిల్ హమీద్ (12) సాయంతో అసిఫ్ మిగతా పని పూర్తిచేశాడు. లక్ష్యాన్ని యూఏఈ 15.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ 1-1తో సమయం అయింది. సిరీస్ డిసైడర్ మూడో టీ20 (UAE vs NZ 3rd T20) నేడు జరగనుంది.
HISTORIC MOMENT IN UAE CRICKET…!!!
Defeated New Zealand for the first time in International cricket. pic.twitter.com/ueXztz1QbS
— Johns. (@CricCrazyJohns) August 19, 2023
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!