Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గల్ఫ్ దేశాల ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాకిస్థాన్‌కు షాకిస్తూ, వాళ్లు ఇచ్చిన భారీ రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌పై ఇది పిడుగు లాంటి వార్తే. అయితే యూఏఈ మాత్రం తన నిధులను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుండటంతో యూఈఏ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇందులో భాగంగా పాకిస్థాన్ వద్ద డిపాజిట్ చేసిన 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,700 కోట్లు) రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని యూఏఈ పాకిస్థాన్‌కు అల్టిమేటం జారీ చేసింది.
READ ALSO: Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇరాన్ పోరు కారణంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో ఆయా దేశాల్లో అభద్రతా భావం నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ఆర్థిక అవసరాల కోసం యూఏఈ.. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ (SBP)లో భద్రపరిచిన డిపాజిట్లను వెనక్కి అడుగుతోంది. వాస్తవానికి ఈ నగదును పాక్ తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వాడుకుంటోంది. పాకిస్థాన్ ప్రసార సంస్థ ‘జియో న్యూస్’ కథనం ప్రకారం.. గతంలో యూఏఈ ఈ రుణ గడువును ప్రతి ఏటా పొడిగించేది. కానీ, 2025 డిసెంబర్ నుంచి కేవలం నెలవారీ ప్రాతిపదికన పొడిగిస్తూ వచ్చి, ఇప్పుడు ఏప్రిల్ 17 వరకు డెడ్ లైన్ విధించింది. ఈ లోపు మొత్తం 2 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఈ మొత్తంపై దాదాపు 6 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ప్రస్తుతానికి పాకిస్థాన్ వద్ద 21 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 బిలియన్ డాలర్లను చెల్లించే సామర్థ్యం పాక్‌కు ఉన్నప్పటికీ, అది జరిగిన వెంటనే విదేశీ నిల్వలు అట్టడుగుకు పడిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ ఈ దేశం అప్పుల కోసం ఐఎంఎఫ్ (IMF) లేదా చైనా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్‌కు దాదాపు 12 బిలియన్ డాలర్ల విదేశీ డిపాజిట్ల పునరుద్ధరణ అవసరం. ఇందులో సౌదీ ($5B), చైనా ($4B), యూఏఈ ($3B) వాటాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాలు తమ నిధులను భద్రపరుచుకునే పనిలో పడ్డాయి. యూఏఈ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇతర దేశాలైన సౌదీ అరేబియాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, సౌదీ కూడా తమ అప్పులను వెనక్కి అడిగితే పాకిస్థాన్ పరిస్థితి ‘పెనం నుంచి పొయ్యిలో పడినట్లు’ మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..