బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 23) సాయంత్రంలోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత ఈ తుఫానుకు ‘హమున్’ అని పేరు పెట్టనున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం గంటకు 13 కి.మీ వేగంతో ఉత్తరం, ఈశాన్య దిశగా కదిలింది. దీంతో ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rajahmundry: నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ లకు సెలవు..
రానున్న కొద్ది గంటల్లో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. అక్టోబర్ 25 సాయంత్రం నాటికి ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమిళనాడు, కేరళలో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఒడిశా, మిజోరాం, మణిపూర్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు (మంగళవారం) త్రిపుర, అస్సాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 25 న నాగాలాండ్, మణిపూర్, త్రిపురలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Devaragattu Bunny Festival: దేవరగట్టు బన్నీ ఉత్సవంపై ఉత్కంఠ.. కర్రల సమరంపై పోలీసుల వ్యూహాం
తుపాన్ దృష్ట్యా.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కోరినట్లు పీటీఐ పేర్కొంది. అలాగే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఒడిశా తీరానికి దాదాపు 200 కి.మీ దూరంలో సముద్రంలోకి తుపాను కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్త యుఎస్ డాష్ తెలిపారు. ఈ సందర్భంగా రానున్న రెండు రోజుల పాటు ఒడిశా తీరప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 80-90 కి.మీల నుంచి 100 కి.మీలకు క్రమంగా పెరుగుతుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. తుపాను ప్రభావం ఒడిశాపై ప్రత్యక్షంగా ఉండదని అన్నారు.