NTV Telugu Site icon

Swimming Tragedy: పండుగ వేళ పెనువిషాదం… కాకినాడలో ఇద్దరి గల్లంతు

Kkd Beach

Kkd Beach

ఈత సరదా కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది. సముద్రం దగ్గరకు సరదాగా స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయదశమి రోజున కాకినాడ సంజీవ్ నగర్ కు చెందిన ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది.. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా NTR బీచ్ కు వచ్చి అందరూ కలిసి బీచ్ లో స్నానం చేస్తున్నారు. ఈ సమయంలో సముద్ర కెరటాల ఉధృతికి దుర్గా ప్రసాద్ (17) కిరణ్ (16) అనే యువకులు ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో యువకులు గల్లంతవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

గల్లంతయిన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిమ్మాపురం పోలీసులు మెరైన్ పోలీసులు గల్లంతైన యువకుల కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ వేళ ఇలా జరగడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ప్రమాదం కారణం ఏంటి? మన నిర్లక్ష్యమా? సముద్రుడి ప్రచండ రూపమా? సాధారణంగా సముద్రం అలలు నిర్ణీత సమయంలో ఎక్కువగా వుంటాయి. అప్పుడు సముద్రంలోకి వెళితే తీవ్రత వల్ల లోపలికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు.

Read Also: Prabhas Performing Ravan Dahan at delhi Live: ప్రభాస్ చేతుల మీదుగా ఢిల్లీలో రావణ దహనం

మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి కి వచ్చి ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా వుంది. ప్రియుడు వేణు, ప్రియురాలు విష్ణు ప్రియగా గుర్తించారు పోలీసులు. విష్ణుప్రియను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ప్రేమికులు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిత్యం భక్తులతో రద్దీగా వుండే మంత్రాలయంలో ఈ ఘటన జరగడంతో కలకలం రేగింది.

Read Also: Sonia Gandhi: మైసూరు ఆలయంలో సోనియాగాంధీ ప్రత్యేక పూజలు