NTV Telugu Site icon

womens fight: నడిరోడ్డుపై లేడీస్ ఫైట్.. ఎవరూ తగ్గట్లేదుగా

Womens Fight

Womens Fight

womens fight: ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఇలా పెట్టగానే అలా వైరల్ అయిపోతున్నాయి. వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. దీంట్లో ఇద్దరు యువతులు నడి రోడ్డుపై జట్లు పట్టుకుని పిడిగుద్దులతో పోట్లాడుకుంటున్నారు. సాధారణంగా మగాళ్ల మధ్య తగాదాలు జరిగితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ మహిళల మధ్య గొడవ జరిగితే అది చర్చనీయాంశమవుతుంది. ఈ గొడవలకు కారణాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి మరి. అందుకే వాటికి అంత క్రేజ్. ప్రేమికుడి కోసం ఇద్దరు యువతులు కొట్టుకోవడం, ఇళ్ల పక్కన చెత్తాచెదారం తదితర చిన్న చిన్న సమస్యలకు మహిళలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడాన్ని తరచూ చూస్తుంటాం. అందుకే అలాంటి గొడవలకు ‘పిల్లి తగాదాలు’ అంటూ కొందరు పేరు కూడా పెట్టారండోయ్.

Read also: jio phone: అదిరిపోయే ఫీచర్లతో జియో 5జీ స్మార్ట్ ఫోన్

తాజాగా జరిగిన ఘటన ఎక్కడ జరిగిందో.. ఎందుకు జరిగిందో.. తెలియదు కానీ ఇద్దరు యువతులు మాత్రం బీభత్సంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని మరీ మొఖంపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. రోడ్డుపై జనాలు ఉన్నారన్న సంగతి మర్చిపోయి మరీ తన్నుకున్నారు. షార్ట్స్, స్కర్ట్ వేసుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ పక్కన వారిని మర్చిపోయారు. పక్క నుంచి వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా పోటీ పడీ మరీ గొడవపడ్డారు. బాక్సింగ్ పంచులతో కొట్టుకుంటుంటే అసలు వీరి మధ్య ఏం జరిగిందా అంటూ అక్కడి వారు ఆసక్తిగా చూస్తూ నిల్చుండి పోయారు.

ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో విసియస్ వీడియోస్ అనే ఖాతా ఫన్నీ ఫైట్‌ను షేర్ చేసింది. ‘ఉగ్ర పిడికిలి’ అంటూ చమత్కారమైన ట్వీట్ చేసింది. 24-సెకన్ల వీడియోకు క్షణాల్లోనే 490 లైక్‌లతో పాటు 16200వ్యూయర్ షిప్ సంపాదించుకుంది.