NTV Telugu Site icon

Andhra Pradesh: అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!

Ap Crime

Ap Crime

Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని  నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో  హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. వారి ఆదేశాలతో 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకోగలిగారన్నారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలించారు.. మరో గంటలో నిందితులను చూపిస్తామన్నారు. ఈ సంఘటనలో ఆరు మంది పాల్గొన్నారని.. వారిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో జగన్ హయాంలో అత్యాచారాలు ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. వారు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.

Read Also: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం

దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు దుండగులు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్‌ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే ఆ వివరాలు తెలియనున్నాయి.