Site icon NTV Telugu

Bhadradri Kothagudem: పిడుగుపాటుకు ఇద్దరు బలి.. మరో ముగ్గురికి గాయాలు

Kmm

Kmm

పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు అరటి తోటలో పనికి వెళ్ళారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై పిడుగు పడింది. దీంతో.. పిడుగుపాటుకు గురై సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (19) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సత్తుపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version