NTV Telugu Site icon

Cyberabad: సైబరాబాద్‌లో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ.. మీ ఫోన్‌ పోయిందా? కంప్లైంట్ చేయండిలా..

Phones

Phones

సైబరాబాద్‌ పోలీసులు రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఆరు నెలల కాలంలో రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. దాదాపు 5కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు రికవరీ చేశారు. తాజాగా 800 సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 800 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. 2.4 కోట్ల రూపాయల విలువైన 800 ఫోన్లను రికవరీ చేశామన్నారు. యాభై మంది పోలీసులు నెలన్నర రోజులు కష్టపడి ఈ ఫోన్లు రికవరీ చేశారని తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

READ MORE: Turkey Terror Attack: టర్కీ రాజధానిలో భారీ ఉగ్రదాడి.. 10 మందికి పైగా మృతి..

ఫోన్ పోతే ఇలా చేయండి..
మొదటగా సెల్​ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి సీఈఐఆర్ పోర్టల్​లో తన వివరాలను నమోదు చేసుకోవాలి. ఒక్కసారి వివరాలు నమోదు చేసిన తర్వాత చోరీ అయిన ఫోన్​ను ఐఎంఈఐ నంబరు ద్వారా బ్లాక్ చేస్తారు. వేరే సిమ్ కార్డు వేసినా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. ఆ విషయాలను పోలీసులకు తెలియజేస్తుంది. దీని ద్వారా పోలీసులు వెంటనే ఫోన్​ను రికవరీ చేసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సెల్​ఫోన్ రికవరీ కేసుల్లో కర్ణాటక మొదటి స్థానం సాధించగా, తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతుంది.

READ MORE: Minister Lokesh: రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..