NTV Telugu Site icon

Tragedy: విషాదం.. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి

Died

Died

Tragedy: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు నవీన్(22),వెంకటేష్ (22)లుగా గుర్తించారు. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి ఆ ఇద్దరు యువకులు చెరువు గుంటలో పడ్డారు. ఊపిరాడక చెరువులోనే మృతి చెందారు. యువకులు ఇంటికి రాకపోవడంతో నేడు పోలీస్ స్టేషన్‌లో మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ సహాయంతో ఘటనా స్థలాన్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో నవీన్‌ అనే యువకుడి మృతదేహం లభ్యం కాగా.. వెంకటేశ్వర్లు మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాలను విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Read Also: Hyderabad: దుండిగల్‌లో లారీని ఢీకొట్టిన స్కోడా కారు, ముగ్గురు మృతి.

Show comments