Flight Cockpit : సాధారణంగా విమానంలోకి బయటనుంచి తినుబండారాలు తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా సిబ్బంది ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. కానీ స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా కాక్ పిట్ లో స్వీట్లు తిని, కూల్ డ్రింక్స్ తాగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో యాజమాన్యం సదరు పైలట్లపై చర్యలకు ఉపక్రమించింది. కాక్‌పిట్‌లో స్వీట్లు తిన్న ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించింది.
Read Also: Parliament : పార్లమెంటులో మైక్‌లను ఎవరు ఆన్ – ఆఫ్ చేస్తారో తెలుసా?
ఇటీవల హోలీ సందర్భంగా ఆ ఇద్దరు పైలట్లు కాక్ పిట్‌లోకి కూల్‌డ్రింక్ గ్లాసులు తీసుకెళ్లారని, స్వీట్లు తిన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి గువహటీకి వెళ్లే విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పైలట్లపై సీరియస్ అయిన యాజమాన్యం వారిని రోస్టర్ నుంచి తొలగిస్తూ విధులకు దూరం చేసింది. పైలట్లపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పందించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Shoaib Akhtar : విరాట్ కోహ్లీ దెయ్యం.. టెండుల్కర్ రికార్డ్ దాటేస్తాడు..
కాగా, హోలీ స్వీట్ అయిన స్వీట్ కజ్జికాయను ఒక పైలట్ చేతిలో పట్టుకోగా, కాక్‌పిట్‌లోని విమాన పరికరంపై ఉంచిన పేపర్‌పై మరొకటి ఉంది. అలాగే డ్రింక్ ఉన్న పేపర్ గ్లాస్, విమాన ఇంధనం కటాఫ్ లివర్‌పై ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెజినట్లు షాకయ్యారు. ఆ డ్రింక్ ఒలికితే ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసి విమాన వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న పైలట్ల నిర్లక్ష్యంపై మరికొందరు మండిపడ్డారు. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ ఫొటోను ట్యాగ్ చేశారు.