Site icon NTV Telugu

Russia: రష్యాలో మరో కీలక పరిణామం.. నావల్నీ గ్రూప్‌నకు చెందిన జర్నలిస్టుల అరెస్ట్

Navarly

Navarly

రష్యాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ గ్రూపునకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను పుతిన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నావల్నీ గ్రూపునకు చెందిన జర్నలిస్టులు వివిధ విదేశీ వార్తా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులతో చేతులు కలిపి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. అయితే రష్యా మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని చేరవేసినట్టుగా జర్నలిస్టులపై అభియోగాలు మోపబడ్డాయి.

ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దీనిపై ప్రపంప వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. పుతిన్ సర్కారే.. నావల్నీ చంపినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు.. రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను నావల్నీ కుటుంబ సభ్యులు కలిశారు. నావల్నీ అనుమానాస్పద మృతిపై చర్చించారు.

మరోవైపు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. రెండేళ్ల నుంచి వార్ సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రాంతం భారీగా నష్టపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా తీవ్ర స్థాయిలోనే ఇరు దేశాల యుద్ధం సాగుతోంది.

 

 

Exit mobile version