Site icon NTV Telugu

Two planes crash : ఎయిర్‌షోలో విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న విమానాలు

Planes Crash

Planes Crash

Two planes crash : అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్‌ ఎయిర్‌ షోలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. నివేదికల ప్రకారం.. రెండు విమానాల్లోని పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 12గంటల సమయంలో చోటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు కూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విమానాలు ఢీకొని నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 40కి‌పైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. శిథిలాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి. రెండు విమానాల్లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. వారంతా మరణించారని అధికారులు తెలిపారు. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి.

Read Also: Congress Helps BJP In Gujarat : గుజరాత్‎లో ఇరుక్కున్న బీజేపీకి కాంగ్రెస్ సాయం

ఎయిర్ షో సమయంలో ఒక బోయింగ్ B-17 గాలిలో విన్యాసాలు చేస్తోంది, అకస్మాత్తుగా బెల్ P-63 అనే మరో విమానం ఈ విమానం సమీపంలోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకముందే రెండు విమానాలు ఢీ కొన్నాయి. రెండు విమానాలు ముక్కలుగా విడిపోయి భూమిపై పడుతుండటంతో వీడియోలో చూడొచ్చు.

Read Also: Beggar Donates Money: బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం

Exit mobile version