Two planes crash : ఎయిర్‌షోలో విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two planes crash : అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్ ఎయిర్ షోలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. నివేదికల ప్రకారం.. రెండు విమానాల్లోని పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 12గంటల సమయంలో చోటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. బాంబర్ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బెల్ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్ విమానం దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు కూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విమానాలు ఢీకొని నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 40కిపైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. శిథిలాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి. రెండు విమానాల్లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. వారంతా మరణించారని అధికారులు తెలిపారు. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి.
Read Also: Congress Helps BJP In Gujarat : గుజరాత్లో ఇరుక్కున్న బీజేపీకి కాంగ్రెస్ సాయం
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఎయిర్ షో సమయంలో ఒక బోయింగ్ B-17 గాలిలో విన్యాసాలు చేస్తోంది, అకస్మాత్తుగా బెల్ P-63 అనే మరో విమానం ఈ విమానం సమీపంలోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకముందే రెండు విమానాలు ఢీ కొన్నాయి. రెండు విమానాలు ముక్కలుగా విడిపోయి భూమిపై పడుతుండటంతో వీడియోలో చూడొచ్చు.
Read Also: Beggar Donates Money: బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం
OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today
This is crazy
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!