LB Nagar: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన చేసే వ్యక్తులు, ఓ వీధికుక్క అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటన తెల్లవారుజామున సమయంలో చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ తీగలు బీడింగ్ తెగిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.
Read Also: Iran Nuclear Site: ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండెతుండి బద్దలైందా..?
మృతులిద్దరూ బిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్న వ్యక్తులుగా గుర్తించబడినప్పటికీ వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ వైర్ల భద్రతా లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
Read Also: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!
