Site icon NTV Telugu

Palnadu District: టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..

Tdp1

Tdp1

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, కోటేశ్వరరావులు వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి గ్రామానికి వస్తుండగా బోదిలవీడు సమీపంలో కారుతో గుద్దించి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యది అని తేలింది. కొంతకాలంగా వెంకట్రామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది.

READ MORE: Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..

ఈ నేపథ్యంలోనే పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు చెబుతున్నారు. కారుతో గుద్దించి కిందపడిన వెంటనే వెంకట్రామయ్య రాయితో దాడి చేసి హత్య చేశాడని చెబుతున్నాడు. హత్య అనంతరం కారు వదిలిపెట్టి పరారయ్యాడంటున్నారు. మరోవైపు సంఘటనాస్థలాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తులు, హత్య చేసిన వ్యక్తులు ఇద్దరూ టీడీపీకి చెందినవారేనని తెలిపారు.

READ MORE: YSRCP Central Office: వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో నిప్పు పెట్టిన దుండగులు..!

Exit mobile version