NTV Telugu Site icon

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి

Accident

Accident

Road Accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పేట వద్ద నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి పంచర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్యలో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ని అరగంట పాటు శ్రమించి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: Fire Accident : అబిడ్స్‌లోని క్రాకర్స్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం…

Show comments