Site icon NTV Telugu

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజులు వడగాల్పులు- ఐఎండీ

Rains

Rains

Weather Alert: మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని.. ఎండలు కొద్ది కొద్దిగా తగ్గుతాయనీ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Balayya : బాలయ్య తో శ్రీదేవి నటించకపోవడానికి కారణం అదేనా..?

దక్షిణ ఛత్తీస్ గఢ్ లో ద్రోణి ప్రభావంతో గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయవ్య గాలులు వీస్తున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36-38 డిగ్రీలుగా ఉండాల్సిందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. అదే విధంగా రాబోయే 24 గంటల్లో ఇదే విధమైన వాతావరణం వుండే అవ‌కాశ‌ముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, మధ్య భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. 38-40 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 15 లేదా 16 నుండి రుతుపవనాల వాతావరణం, ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతాలలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.

Read Also: Koppula Eshwar: అది ఎలా కుదురుతుంది.. జీవన్ రెడ్డికి కొప్పుల ఈశ్వర్ కౌంటర్

అటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఉరుములు-మెరుపులతో కూడిన ఈదురుగాలులు మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Exit mobile version