NTV Telugu Site icon

Champions Trophy : మిల్లర్ భారీ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి ఇద్దరు వ్యక్తులు జంప్!

Millar

Millar

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.

READ MORE: Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..

అయితే ఈ మ్యాచ్‌లో ఎప్పుడూ జరగని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్స్ బాదాడు. ఆ బంతిని ఇద్దరు వ్యక్తులకు దొరికింది. ఆ బంతిని తీసుకున్న ఆ వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు జంప్ అయ్యారు. ఇది చాలా అరుదైన ఘటన! ఐసీసీ ఈవెంట్ లో ఇలా జరగడం ఇదే తొలి సారి అని చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరి వ్యక్తులు స్టేడియం నుంచి బంతిని తీసుకుని వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఘటన మొదటి సారి చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

READ MORE: Mallu Ravi: బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలే కారణం.. కాంగ్రెస్ ఓటమిపై ఎంపీ రియాక్షన్..