NTV Telugu Site icon

Lorrys Burnt: నిలిపి ఉంచిన లారీలు దగ్ధం.. కారణాలేంటి?

Lorrys

Lorrys

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకస్మాత్తుగా రెండు లారీలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. పి.గన్నవరం నియోజవర్గంలోని అంబాజీపేటలో శ్రీ పట్టాభిరామ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న రెండు లారీలు దగ్ధం అయ్యాయి. డోర్ డెలివరీ చేయాల్సిన సామాన్లతో నిండి ఉన్న ఒక లారీ పూర్తిగా దగ్ధం కాగా మరో లారీ పాక్షికంగా దెబ్బతింది. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా. మంటలను అదుపు చేశారు అమలాపురం, కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లారీల దగ్ధం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఏ కారణాల వల్ల జరిగింది? ఆస్తి నష్టం ఎంత అనేది తేలాల్చి ఉంది.

మేడపై నుంచి పడి మహిళ మృతి

విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి త్రినాధపురంలో వాసం శాంతి (28) అనే మహిళ మృతి చెందింది. ప్రమాదవశాత్తు మెడపై నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది మహిళ. భర్తతో మనస్పర్ధలు కారణంగా ఇద్దరు పిల్లలతో సహా రెండేళ్లుగా అమ్మ వద్దనే ఉంటుంది శాంతి. రాత్రి మెడపై నిద్రించేందుకు వెళ్లిన శాంతి ఉదయం శవమై కనిపించిందంటూ రోదిస్తుంది తల్లి కుమారి. పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతురాలి తల్లి. భర్తపై అనుమానం వుందంటోంది మృతురాలి తల్లి. తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారు.