Site icon NTV Telugu

US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

Road Accident

Road Accident

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:LRS Scheme: మే 31 వరకు ఎల్‌ఆర్‍ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం..!

క్లీవ్ లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ చనిపోయినట్లు వెల్లడించింది. భారత కాన్సులేట్ జనరల్ ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. కాన్సులేట్ కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థుల మృతితో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Exit mobile version