Site icon NTV Telugu

Madhya Pradesh: పెళ్లి వేడుకలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి

Madya Pradesh

Madya Pradesh

మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ గ్రామంలో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే వాహనం ఢీకొని మైనర్ బాలికతో సహా ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని తంగ్నా మల్ గ్రామం నుంచి ప్రారంభమైన భరాత్.. గురువారం రాత్రి జమూధన గ్రామానికి చేరుకోగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read Also: Devara : రికార్డ్ వ్యూస్ తో నెట్టింట దూసుకుపోతున్న దేవర ‘ ఫియర్ సాంగ్ ‘..

వివరాల్లోకి వెళ్తే.. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి రాత్రి 10 గంటల తర్వాత పాటలు ప్లే చేయడం మానేశాడు. దీంతో.. అతనికి పెళ్లికి వచ్చిన బంధువుల మధ్య గొడవ చెలరేగింది. పాటలు పెట్టాల్సిందేనని బంధువులు వాదించగా.. డీజే ఆపరేటర్ మాత్రం సమయం అయిపోయిందని వారితో చెప్పాడు. ఈ క్రమంలో.. అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. దీంతో.. అడ్డగించబోయిన ముగ్గురు మహిళలు వాహనం చక్రాల కింద పడిపోయారు.

Read Also: Water Crisis : దేశంలోని 150 రిజర్వాయర్లలో మిగిలింది… కేవలం 23 శాతం కంటే తక్కువ నీరేనట

దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రమరతి (55) అనే మహిళ మరణించింది. మిగిలిన వారు రేష్మ (17), శాంత (30)లను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రేష్మ మృతి చెందగా.. శాంత అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో స్థానికులు వాహనానికి నిప్పు పెట్టారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామని బేతుల్‌ అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ కమలా జోషి తెలిపారు.

Exit mobile version