NTV Telugu Site icon

Mountains: భూమి అడుగున మౌంట్ ఎవరెస్ట్ కన్నా రెండు ఎత్తైన పర్వతాలు.. ఎక్కడంటే..!

Mountains

Mountains

ఎవరెస్ట్ పర్వతం కంటే 100 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను భూమి అడుగున శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిపెద్ద పర్వతాలు ఆఫ్రికా-పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులో గుర్తించారు. ఈ మేరకు నేచర్ జర్నల్‌లో ఒక సంచలనాత్మక పరిశోధనను ప్రచురించింది.

ఇది కూడా చదవండి: ICC T20: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024 కెప్టెన్‌గా ‘హిట్ మ్యాన్’..

ఈ రెండు శిఖరాలు భూమి యొక్క ఉపరితలం క్రింద గుర్తించినట్లుగా కథనంలో పేర్కొంది. ఎవరెస్ట్ పర్వతం 8.8 కి.మీ ఎత్తులో ఉంటే.. ఈ రెండు పర్వతాలు మాత్రం 1,000 కి.మీ ఎత్తు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ రెండు పర్వతాలు అర బిరయన్ ఏళ్లనాటిగా పరిశోధకులు అంచనా వేశారు. రెండు పర్వతాల ఉనికిని భూకంప కొలత సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ పర్వతాలు ఏంటో ఎవరికీ తెలియదు అని ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అర్వెన్ డ్యూస్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Earphones: అదిరిపోయే ఫీచర్లతో.. రూ. వెయ్యి ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఇవే!