Nepal Earthquakes: 2 గంటల్లోనే రెండు భూకంపాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two earthquakes hit Nepal within 2 hours, no casualties reported: శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో రెండు గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. ఒకటి మోస్తరుగా, మరొకటి తేలికపాటి తీవ్రతతో సంభవించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో మొదటి భూకంపం రాత్రి 11:58 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సంభవించగా, శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు 5.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8, 5.9 తీవ్రతతో రెండు భూకంపాలు రాత్రిపూట నేపాల్‌ను తాకాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రెండు భూకంపాలు రెండు గంటల వ్యవధిలోనే సంభవించాయని నేపాల్‌లోని సుర్ఖేత్ జిల్లాలో ఉన్న భూకంప కేంద్ర అధికారి రాజేష్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Read Also: Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్
Also Read
భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.ఇటీవల కాలంలో నేపాల్‌లో తరుచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీతోపాటు రాజస్థాన్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. 2015, ఏప్రిల్ 25న నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ నేపాల్ ఖాట్మండులో సంభవించిన ఈ భూకంపం కారణంగా 9,000 మంది మరణించారు. అనేక వేల మంది గాయపడ్డారు. ఖాట్మండు, ఇతర సమీప పట్టణాలలో 600,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్‌శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..