NTV Telugu Site icon

Diamonds: కర్నూలు జిల్లాలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం..

Diamonds

Diamonds

కర్నూలు జిల్లాలో ఒకే రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు. జిల్లాలోని తుగ్గలి (మం) జొన్నగిరిలో ఒకేరోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఒక వజ్రానికి 6 లక్షలు ఆరు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. మరో వజ్రాన్ని నిర్వాహకులు ఇంకా వేలం వేయలేదు. ఈ వజ్రం విలువ రూ. 12 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లో గుట్టు చప్పుడు కాకుండా 10 వజ్రాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

Read Also: Drunk Man: తప్పతాగి 30 అడుగుల డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..

ఇదిలాఉంటే.. శనివారం (మే 25) మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట మొదలు పెట్టారు. ఓ రైతుకు విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కె్ట్ లో ఆ వజ్రం ధర రూ. 30 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మదనంతపురం పొలాల్లోకి గ్రామస్థులు పోటెత్తారు.

Read Also: Virat Kohli : జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు

వర్షాకాలంలో వజ్రాల కోసం పెద్ద ఎత్తున స్థానికులు పొలాల్లో వెతుకుతుంటారు. చాలా కాలంగా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లా వాసులే కాదు అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి వెతుకుతుంటారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో వెతుకుతుంటారు.