NTV Telugu Site icon

Finger Ring Missing Case: వేలి రింగ్‌ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీఐని ఏ2గా చేర్చాలని కోర్టు ఆదేశాలు..

Court

Court

Finger Ring Missing Case: ఓ వ్యక్తి వేలుకి పెట్టుకునే రింగ్‌ మిస్సింగ్‌ వ్యవహారం ఇప్పుడు ఓ సీఐ మెడకు చుట్టుకుంది.. ఈ కేసులో సీఐని ఏ2గా చేర్చాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో కీలమైన ఆదేశాలు ఇచ్చిన కోర్టు.. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నాడు టి.జయరామిరెడ్డి అనే వ్యక్తి అయితే.. తన రింగ్‌ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కానీ, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాకపోగా.. చంద్రబాబు ఫొటో ఉంటే ఎవరైనా కేసు నమోదు చేస్తారా..? అంటూ హేళనగా మాట్లాడారట అప్పటి సీఐ మహేశ్వరరెడ్డి.. దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.. ప్రైవేట్‌ కేసు వేశారు.. దీనిపై తాజాగా తిరుపతి 2వ మున్సిపల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో అప్పటి ఈస్ట్ సీఐ మహేశ్వరరెడ్డిని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు. దీంతో.. రింగ్‌ మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విట్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.

Read Also: Ramcharan : క్లింకారా కు తినిపిస్తుంటే నాలో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి..