Site icon NTV Telugu

Twinkle Khanna: 50 ఏళ్ల వయసులో డిగ్రీని పొందిన ట్వింకిల్ ఖన్నా.. అక్షయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Twinkle Khanna

Twinkle Khanna

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు, పిల్లలు, హీరో సినిమా విషయాలను చూసుకుంటుంది.. అక్షయ్ సినిమా విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఈమె మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.. 50 ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టాను అందుకున్నారు.. మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేయడంపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు..

సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్‌, నన్ను, పిల్లలను చూసుకుంటూనే విద్యనభ్యసించావు. నేను సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్‌ మై లవ్‌” అని పేర్కొన్నారు. ట్వింకిల్‌ పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్యాగ్ చేశారు.. ఈ పోస్ట్ పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు..

అక్షయ్ పోస్ట్ పై తాజాగా స్పందించిన ఆమె.. ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం” అని అన్నారు. 50 ఏళ్ల ట్వింకిల్‌.. లండన్‌ విశ్వవిద్యాలయం (గోల్డ్‌స్మిత్స్‌) నుంచి ఫిక్షన్‌ రైటింగ్‌లో పట్టా పొందారు. హిందీలో ‘బర్సాత్‌’తో 1995లో తెరంగేట్రం చేసిన ట్వింకిల్‌ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాన్‌’, ‘దిల్‌ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘శీను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు..

Exit mobile version