Site icon NTV Telugu

TVS Price Cut: పండగ వేళ టీవీఎస్ గుడ్ న్యూస్.. స్కూటర్లు, బైక్ ల ధరలు వేలల్లో తగ్గింపు

Tvs

Tvs

దేశంలో సెప్టెంబర్ 22 నుండి GST కొత్త సవరణలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS కూడా తన స్కూటర్లు, బైకుల ధరలను తగ్గించింది. కంపెనీ 10 స్కూటర్లు, మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు వివిధ రకాల స్కూటర్ల ధరలు తగ్గించారు. టీవీఎస్ వివిధ స్కూటర్లు, మోటార్ సైకిళ్లపై రూ. 3,854, రూ. 9,600 మధ్య ధరలను తగ్గించింది.

Also Read:Gudivada Amarnath: బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం..

సమాచారం ప్రకారం.. జూపిటర్ 110 ధర రూ.6481 తగ్గింది. జూపిటర్ 125 ధర రూ.6795, ఎన్ టార్క్ 125 రూ.7242, ఎన్ టార్క్ 150 రూ.9600, టీవీఎస్ ఎక్స్ఎల్ 100 రూ.3854, రేడియన్ రూ.4850, స్పోర్ట్ రూ.4850, స్టార్సిటీ రూ.8564, రైడర్ రూ.7125, జెస్ట్ రూ.6291 తగ్గాయి.

Also Read:KP Sharma Oli: 18 రోజుల తర్వాత ప్రత్యేక్షమైన నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి..

ధరలు తగ్గించిన తర్వాత జూపిటర్ కొత్త ధర రూ.72,400, జూపిటర్ 125 రూ.75,600, N టార్క్ 125 రూ.80,900, N టార్క్ 150 రూ.1.09 లక్షలు, XL 100 రూ.43,900, రేడియన్ రూ.55,100, స్పోర్ట్ రూ.55,100, స్టార్సిటీ రూ.72,200, రైడర్ రూ.80,500, జెస్ట్ రూ.70,600. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Exit mobile version