Site icon NTV Telugu

TVS Jupiter CNG: టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ వచ్చేస్తోంది.. 226KM మైలేజ్.. డబ్బులు ఆదా అవడం పక్కా!

Jupitar

Jupitar

టీవీఎస్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అత్యంత పాపులారిటీ పొందిన టీవీఎస్ జూపిటర్ ను సీఎన్జీలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ 226 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎన్జీ వాహనాలతో డబ్బు ఆదా కావడం పక్కా అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Also Read:USA: భారతీయులకు ట్రంప్ దెబ్బ.. ఈసారి H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములే టార్గెట్..

TVS ఈ స్కూటర్‌ను 2025 ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ఒక కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది. ఇది 2026 మధ్య నాటికి అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌గా బిల్ చేయబడుతుందని భావిస్తున్నారు. కాన్సెప్ట్ మోడల్‌లో చూసినట్లుగా, CNG ట్యాంక్ సీటు కింద అందించారు. ఈ స్కూటర్ 1.4 కిలోల CNG ట్యాంక్‌తో వస్తుంది, ప్రతి కిలో CNGకి 84 కి.మీ వరకు పరిధిని అందిస్తుందని వెల్లడిస్తున్నారు.

Also Read:Pregnant Job Scam: “నన్ను ప్రెగ్నెంట్ చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా”.. మహిళ బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..

ఈ స్కూటర్ CNG కార్ల మాదిరిగానే బయోఫ్యూయల్ టెక్నాలజీతో వస్తుంది. అంటే ఇది పెట్రోల్, CNG రెండింటిలోనూ నడుస్తుంది. ఇది స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చబడిన చిన్న 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను కూడా కలిగి ఉంటుంది. జూపిటర్ CNG పెట్రోల్, CNGతో కలిపి 226 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని TVS పేర్కొంది. CNG ఫిల్లింగ్ నాజిల్, ప్రెజర్ గేజ్ ట్రంక్ లోపల ఉంటాయి. దీని అర్థం కస్టమర్లు సీటును ఓపెన్ చేసి ఫ్యుయల్ నింపాల్సి ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ CNG 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.1 bhp, 9.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ.గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version