TVS Jupiter 110 Special Edition: టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అత్యంత పాపులర్ స్కూటర్ అయినా జూపిటర్ 110 కొత్త స్పెషల్ ఎడిషన్ (TVS Jupiter 110 Special Edition)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ‘స్టార్‌డస్ట్ బ్లాక్’ (Stardust Black) అని పిలువబడే ఈ కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ విశేషాలను చూసేద్దామా..
ఈ కొత్త స్కూటర్ పూర్తిగా ఆల్-బ్లాక్ కలర్ స్కీమ్ తో వస్తుంది. క్రోమ్ ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మినహా మొత్తం బాడీ నలుపు రంగులో ఉంటుంది. కంపెనీ లోగో, స్కూటర్ మోడల్ పేరు సహా అన్ని బ్యాడ్జింగ్‌లు బ్రోన్జ్ (bronze) రంగులో వచ్చాయి. ఇది ఇతర వేరియంట్లలో కనిపించే క్రోమ్ బ్యాడ్జింగ్ కంటే భిన్నంగా ఉంది. డిస్క్ ఎస్ఎక్స్సీ (SXC) మోడల్ మాదిరిగానే ఈ స్పెషల్ ఎడిషన్‌లో కిక్-స్టార్ట్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఒకవేళ కావాలనుకుంటే డీలర్‌షిప్ వద్ద సంప్రదించి దానిని కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ క్యాన్సిలేషన్, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లతో Samsung Galaxy Buds3 FE లాంచ్!
ఈ కొత్త జూపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ 113.3cc ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది 7.91 బీహెచ్‌పీ (Bhp) శక్తిని, 9.80 ఎన్ఎం(nm) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇక స్కూటర్ సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఇక ముందు వైపున టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక వైపున 3 స్టెప్ అడ్జస్టబుల్ సిస్టమ్‌తో కూడిన ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు వైపున 220mm డిస్క్, వెనుక వైపున 130mm డ్రమ్ బ్రేక్ ఉపయోగించారు. ఇక ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.
RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
ఈ స్కూటర్‌లో స్మార్ట్ ఎక్స్‌కనెక్ట్ (SmartXonnect) కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో వాయిస్ అసిస్టెన్స్, డిస్టెన్స్ టు ఎంప్టీ, వెహికల్ ట్రాకింగ్, సగటు ఇంధన వినియోగం, కాల్ ఇంకా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, నావిగేషన్ సపోర్ట్ లభిస్తాయి. ఇక ఈ స్కూటర్ ధర రూ. 93,031 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది టాప్-స్పెక్ డిస్క్ ఎస్ఎక్స్సీ (SXC) వేరియంట్ కంటే ఎక్కువ ధరతో, అత్యంత ఖరీదైన జూపిటర్ మోడల్‌గా నిలిచింది.
