Site icon NTV Telugu

TVS Apache RTX 300: టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ లవర్స్ కు షాక్.. భారీగా పెరిగిన ధర.. ఎంతంటే?

Tvs Apache Rtx 300

Tvs Apache Rtx 300

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ బైకులకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. స్టైలిష్ లుక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్ లవర్స్ కు కంపెనీల బిగ్ షాకిచ్చింది. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన అడ్వెంచర్ మోటార్‌సైకిల్, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300 ధరను పెంచింది. ఈ మోటార్‌సైకిల్ బిటిఓ వేరియంట్ ధరను పెంచారు. నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ధర రూ. 5,000 వరకు పెరిగింది. ఇది ఒకే ఒక వేరియంట్ కు మాత్రమే. బేస్, టాప్ వేరియంట్ ల ధర మారలేదు.

Also Read:Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కొత్త సినిమా పూజ

తయారీదారు ఈ మోటార్ సైకిల్ పై అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS, ఐదు అంగుళాల TFT డిస్ప్లే, క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఈ మోటార్ సైకిల్ 299.1cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 36 PS శక్తిని, 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో జత చేశారు. ధరల పెరుగుదల తర్వాత, BTO వేరియంట్ ధర ఇప్పుడు రూ. 2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్). బేస్ వేరియంట్ ధర రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version