Site icon NTV Telugu

2025 TVS Apache RTR 160 2V: టీవీఎస్ నుంచి కొత్త బైక్ విడుదల.. ధర ఎంతంటే?

Tvs

Tvs

బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఈ రెండు కలర్ ఆప్షన్లతో రెడ్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా అందించారు. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2వి 16.04 PS శక్తిని, 13.85 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 159.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ తో వస్తుంది. ఈ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడింది.

Also Read:Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఎన్‌కు ఆమె తల్లి విజ్ఞప్తి..

2025 TVS Apache RTR 160 2V డబుల్-క్రెడిల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. దీనికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియర్ గ్యాస్-చార్జ్డ్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం దీనికి 270mm ఫ్రంట్, 200mm రియర్ పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్-ఛానల్ ABS ని కలిగి ఉంది. ఈ బైక్‌లో 7-అంగుళాల వీల్స్ ఉన్నాయి. వీటిపై 90-సెక్షన్ ఫ్రంట్, 120-సెక్షన్ రియర్ ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు.

Also Read:Junior: ఎంటర్‌టైనింగ్గా కిరీటి రెడ్డి ‘జూనియర్’ టీజర్

ఇది 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, ​​790mm సౌకర్యవంతమైన సీటు ఎత్తు, 180mm మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ తో వస్తుంది. ఇది TVS SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్, రైడ్ డేటా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

Exit mobile version