TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Leaders Controversies: తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వరుస వివాదాల్లో చిక్కుకుంటుండటంపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహాబలిపురంలోని ఇంటర్కాంటినెంటల్ రిసార్ట్‌లో పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈ కీలక భేటీ ప్రారంభం కానుంది.
ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, కళ్లకురిచ్చి ఎమ్మెల్యే అరుల్ విగ్నేష్‌ల తీరుపై సీఎం విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. తన నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ప్రస్తావించినందుకు ఒక స్థానిక ఫొటోగ్రాఫర్‌పై డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రవిశంకర్ దాడి చేయడం, ఆ తర్వాత బెదిరించి వీడియో విడుదల చేయించడం తీవ్ర దుమారం రేపింది. మరోవైపు కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ పద్మజకు ఎమ్మెల్యే అరుల్ విగ్నేష్ అసభ్యకరంగా మెసేజ్‌లు పంపడంతో పాటు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. అయితే తాను ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు.
Also Read
- Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
- YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
- Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
- Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
మరోవైపు గత నాలుగు నెలలుగా టీవీకే నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. అనుభవరాహిత్యంతో చాలామంది కొత్త, యువ ఎమ్మెల్యేలు బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా మాట్లాడటం, “లంచం ఇస్తున్నారు.. తీసుకోవాలో వద్దో ఆలోచిస్తున్నాం” అంటూ బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం విపక్షాల విమర్శలకు ఆయుధంగా మారింది. ఇప్పటికే కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించినప్పటికీ తీరు మారకపోవడంతో సీఎం ఈ సమావేశంలో నేరుగా క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు.
విపక్షాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ పాలనా ప్రతిష్టను కాపాడుకునేందుకు సీఎం విజయ్ ఈ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై పార్టీ పరంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు.? నేతలకు ఎలాంటి మార్గదర్శకాలు నిర్దేశిస్తారనే.. అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అత్యవసర సమావేశంలో పార్టీ కీలక నేత ఆదవ అర్జున సైతం పాల్గొని పరిస్థితిని సమీక్షించనున్నారు.
తాజావార్తలు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
-
Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!