Meghana Lokesh : బుల్లితెర ప్రేక్షకులకు మేఘనా లోకేష్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ.. చేతినిండా సంపాదిస్తున్న ఆమె ఉన్నట్లుండి చనిపోవాలని ఉందంటూ యూట్యూబ్ లో పెట్టిన వీడియో ఇప్పుడు అభిమానుల్లో కలకలం సృష్టిస్తోంది. మేఘనా లోకేష్.. ప్రస్తుతం ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ చేస్తున్న ఈమె తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంట్లోనూ ఒక మనిషిలా కలిసిపోయింది. ఇప్పుడు ఊహించని విధంగా ఒక వీడియో పోస్ట్ చేసి నెటిజనుల్లో కలవరం సృష్టిస్తోంది. దీంతో అభిమానులు, ఈమె ఫ్రెండ్స్ అయితే తెగ కంగారు పడిపోతున్నారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Read Also: Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
పూర్తి వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటీనటులంటే ఒకప్పుడు సీరియల్స్, షోలలో మాత్రమే నటించేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. అయితే రోజు కంటెంట్ దొరకడం అంటే ఎవరికైనా చాలా కష్టం అనిపిస్తుంది . అందులో భాగంగానే కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ తో షాక్ ఇచ్చేలా.. కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటిదే మేఘనా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
Read Also:Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం
ఇటీవల ఆమె తన ఇంట్లో ఖాళీ ఉన్న సందర్భంలో బోరు కొట్టడంతో ఫ్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయింది. తన ఫ్రెండ్ స్వర్ణకి కాల్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు నీరసంగా అనిపిస్తుంది ..చచ్చిపోతానేమో’ అని అయోమయంగా మాట్లాడింది. దీంతో అవతలి వైపు ఉన్న స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తా కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో ఇది ఫ్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.