Tunisha Sharma Case: టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో నిందితుడు షీజన్‌ఖాన్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డాడు. కస్టడీలో ఉన్న నిందితుడు ఇంట్లో వండిన భోజనంతో పాటు మందులు, కుటుంబ సభ్యులను కలవాలని డిమాండ్ చేశారు. షీజన్ ఖాన్ తరపు న్యాయవాది తన క్లయింట్ తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నారని, రోజూ ఆస్తమా ఇన్‌హేలర్‌ని ఉపయోగించాలని వాదించారు. అతను నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడానికి తన కుటుంబాన్ని, న్యాయవాదులను కలవాలని నిందితుడి న్యాయవాది నొక్కి చెప్పారు. డిసెంబర్ 24న ఒక టీవీ సీరియల్ సెట్‌లో తునీషా శర్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆమె మరణానికి పక్షం రోజుల ముందు షీజన్‌తో విడిపోయినట్లు సమాచారం.
Amit Shah: రానున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా కీలక నిర్ణయం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షీజన్ విచారణకు సహకరించడం లేదని, తన ప్రియురాలితో చాట్‌ల గురించి అడిగినప్పుడు పదేపదే వాంగ్మూలాలు మార్చేవాడని తెలిపారు. రికవరీ చేసిన కొన్ని చాట్‌ల ప్రకారం నిందితుడు చాలా మంది మహిళలతో మాట్లాడేవాడని పోలీసులు తెలిపారు. తునీషా తల్లి వనితా శర్మ శుక్రవారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. షీజన్‌పై పలు ఆరోపణలు చేయడంతో పాటు “హత్య” అనుమానాన్ని కూడా లేవనెత్తారు.”షీజన్ ఆమెను గది నుంచి తీసుకువెళ్ళాడు కానీ అంబులెన్స్‌కి కాల్ చేయలేదు. ఇది హత్య కూడా కావచ్చు, ఆమె షీజన్ గదిలో కనుగొనబడింది. షీజన్ మాత్రమే ఆమెను క్రిందికి తీసుకువచ్చాడు, కానీ అంబులెన్స్‌కి లేదా వైద్యులకు కాల్ చేయలేదు. షీజన్ ఆమెను హిజాబ్ కూడా ధరించమని బలవంతం చేశాడు” అని వనితా శర్మ శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
