Site icon NTV Telugu

Tuvalu: ఆ దేశంలోనే ఇది తొలి ఏటీఎం.. ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధాని హాజరు..

Tuvalu

Tuvalu

ఏటీఎం ప్రారంభానికి ఎవరు వస్తారు? ఆ ఏటీఎంకి సంబంధించిన బ్యాంకు మేనేజర్, లేదా ఇతర కింది స్థాయి అధికారులు హాజరవుతారు. కానీ.. ఏటీఎం ప్రారంభానికి ఏకంగా ప్రధాని హాజరు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? కానీ.. ఇక్కడి అది జరిగింది. అవునండి.. నిజంగానే ఏటీఎం ప్రారంభానికి ప్రధాని హాజరయ్యారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఏం చేస్తాం ఆ దేశంలో ఇదే తొలి ఏటీఎం మరి.

READ MORE: Infinix Note 50s 5G+: స్టైలిష్ డిజైన్.. సూపర్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల

తువాలు దేశం గురించి అందరూ వినే ఉంటారు. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని 9 చిన్న చిన్న ద్వీపాల సముదాయం ఈ తువాలు దేశం. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఉంటుంది. దీని జనాభా జస్ట్ 12 వేల మంది మాత్రమే. ఈ బుజ్జి దేశంలో ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు.

READ MORE: Preetika Rao : ఆ నటుడు అమ్మాయి కనిపిస్తే వదలడు.. స్టార్ యాక్టర్ కామెంట్స్..

రాను రాను సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో ద్వీపదేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది. భావితరాలకు సైతం వీరి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా తువాలు డిజిటల్‌ దేశంగా మారనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఏటా చేస్తున్న తీర్మానాలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. కర్బన ఉద్గారాల కారణంగా నీటిమట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్‌ గతేడాది ప్రకటించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగానే తాజాగా ఏటీఎం సేవలు ప్రారంభించింది.

Exit mobile version