ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో పరాజయం నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ ఇలా వరుసగా రెండు ఓటములు చవిచూడటం చెన్నై అభిమానులను బాధిచింది. అయితే ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా చివరి బంతి వరకు సాగినప్పటికీ ఆఖరి బంతికి పంజాబ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Also Read : Kodali Nani Sensational Comments Live: పవన్ కళ్యాణ్ స్క్రాప్.. కొడాలి నాని కామెంట్స్
మ్యాచ్ లో సీఎస్కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం తుషార్ దేశ్ పాండే వైపు వెళ్లింది. కేవలం 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకుని మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు ఇవ్వడం తుషార్ వీక్ నెస్ గా మారింది. ఇన్సింగ్స్ 16వ ఓవర్ లో తుషార్ దేశ్ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read : MI vs RR : బ్యాటింగ్ లో అదరగొడుతున్న రాజస్థాన్.. 10ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
మ్యాచ్ పంజాబ్ వైపు తిరగడానికి ఇదే టర్నింగ్ పాయింట్.. తుషార్ దేశ్ పాండే దీనికి బాధ్యత వహించాడు. మరో విషమమేంటంటే.. దేశ్ పాండే ప్రతీ మ్యాచ్ లో వైడ్లు వేస్తూ అదనపు పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ అంశం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా నచ్చడం లేదు అని తెలుస్తోంది. ప్రతీ మ్యాచ్ లో ధోని సూచిస్తున్నప్పటికీ తుషార్ వైడ్లు వేయడం మాత్రం ఆపడం లేదు.. కానీ విచిత్రంగా ఐపీఎల్ 16వ సీజన్ లో ఇప్పటి వరకు 17 వికెట్లు తీసిన తుషార్ పర్పుల్ క్యాప్ కేసులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
