NTV Telugu Site icon

Israel Hamas War: ఇజ్రాయెల్‌ ఓ ఉగ్రవాద దేశం.. నెతన్యాహుపై టర్కీ అధ్యక్షుడు ఆగ్రహం

Turki

Turki

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పందించారు. ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా అతడు అభివర్ణించారు. ఇజ్రాయెల్ ఒక నగరాన్ని, అక్కడి ప్రజలను పూర్తిగా నాశనం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది అని ఎర్డోగాన్ అన్నారు. ఇజ్రాయెల్ యొక్క రాజకీయ, సైనిక నాయకులు గాజాలో తీసుకున్న చర్యలకు అంతర్జాతీయ న్యాయస్థానాలలో విచారణను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని టర్కీ అధ్యక్షుడు తెలిపారు. గాజాలోని అణగారిన ప్రజలను దారుణంగా హత్య చేసిన ఇజ్రాయెల్ పై అంతర్జాతీయ న్యాయస్థానాలలో విచారణను ఎదుర్కొనేలా మేము చర్య తీసుకుంటామని టర్కీ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.

Read Also: KTR Road Show: ఈనెల 20 వరకు కేటీఆర్‌ రోడ్ షో.. షెడ్యూల్ ఇదీ..

నెతన్యాహు గాజాను అణుబాంబుతో బెదిరిస్తున్నారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆరోపించారు. నీ దగ్గర అణుబాంబులు ఉన్నాయనీ.. మాకు తెలుసు, మీ అంతం దగ్గరపడింది. మీకు కావలసినన్ని అణుబాంబులను కలిగి ఉండవచ్చు.. కానీ మీ పతనం మాత్రం తొందరలోనే వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. పాశ్చాత్య దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయని ఆయన తెలిపారు. హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ కాదని.. దాని భూమిని విముక్తి చేయడానికి ప్రయత్నించే విముక్తి సమూహం అని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు.

Read Also: TRAI: మోసగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారా? అవాంఛిత కాల్స్ గురించి ట్రాయ్ హెచ్చరిక

ఇక, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హమాస్ తీవ్రవాద రాజ్యానికి టర్కీ మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే శక్తులు ఉన్నాయన్నారు. 239 మంది బందీలు హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నంత కాలం.. మానవతా సహాయం ఆపే అవకాశం లేదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.