Site icon NTV Telugu

Turkey : నేడు టర్కి ప్రెసిడెంట్ ఎలక్షన్స్.. మళ్లీ ఎర్డోగన్ కు పదవి దక్కేనా ?

Turkey Presidential Election

Turkey Presidential Election

Turkey : టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. వచ్చే ఐదేళ్లపాటు ఆయన కొనసాగాలా.. వద్దా అనే విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. నేడు టర్కీ అధ్యక్ష ఎన్నికల రెండో దశ పోలింగ్‌ జరుగుతోంది. మొదటి దశ పోలింగ్ మే 14న జరిగింది. తొలి రౌండ్‌లో ఎవరికీ మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు ఎర్డోగన్‌, ఆయన ప్రత్యర్థి కెమల్‌ కిలిక్‌దరోగ్లు మధ్య గట్టి పోటీ నెలకొంది.

Read Also:Dog attacks: తెలంగాణలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. బలవుతున్న చిన్నారులు

తొలి రౌండ్ ఓటింగ్‌లో ఇద్దరిలో ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. ఈరోజు రన్‌ఆఫ్ ఓటింగ్ అంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య నిర్ణయాత్మక పోటీ ఉంటుంది. టర్కీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 50 శాతం ఓట్లు అవసరం. ఇది జరగకపోతే, రెండవ దశ ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్‌ను ‘రన్ ఆఫ్’ అంటారు. ఈ నిర్ణయాత్మక పోటీలో ఎర్డోగన్‌ కుర్చీ మళ్లీ దక్కుతుందా లేక ఓడిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టర్కీలో స్థానిక కాలమానం ప్రకారం, ఓటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది 5 గంటల వరకు కొనసాగుతుంది. నేటి ఓటింగ్‌పై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించాయి.

Read Also:Pakistan: పాకిస్తాన్‌లో విరుచుకుపడిన హిమపాతం.. 11 మంది మృతి

తొలి రౌండ్‌లో 88.8 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎర్డోగన్‌కు 49.4 శాతం ఓట్లు రాగా, గాంధీ ఆఫ్ టర్కీగా పిలుచుకునే కిలిక్‌డరోగ్లుకు 45 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో నేషనలిస్ట్ అభ్యర్థి సినాన్ ఒగన్‌కు 5.2 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్లుగా ఎర్డోగన్ టర్కీని పాలిస్తున్నాడు. 2003 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. అదే సమయంలో, 2014 సంవత్సరంలో అతను టర్కీ అధ్యక్షుడయ్యాడు. ఈ 20 ఏళ్లలో దేశానికి ప్రధానిగానూ, రాష్ట్రపతిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Read Also:Delhi University : డీయూకు చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ లో మార్పు.. సావర్కర్‌పై కొత్త అధ్యాయం

ఎర్డోగన్ ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లు ఈ ఎన్నికల్లో గెలిస్తే, టర్కీలో ఎర్డోగన్ పని పట్ల అక్కడి ప్రజలు అసహనంగా ఉన్నారని తేలుతుంది. ఆమనపై వారిలో కోపం ఉంది. తాజాగా టర్కీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 6న సంభవించిన శక్తివంతమైన భూకంపంలో నగరాల తర్వాత నగరాలు ధ్వంసమయ్యాయి. 50 వేల మందికి పైగా మరణించారు.

Exit mobile version