Site icon NTV Telugu

Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. కూలిపోయిన భవనాలు!

Turkey Earthquake

Turkey Earthquake

6.1 Earthquake Hits Turkey: పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బలికెసిర్‌ ప్రావిన్సులోని సిందిర్గిలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన ఇస్తాంబుల్‌, ఇజ్మీర్‌ సహా పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపారు.

భారీ భూకంపం దాటికి సిందిర్గి పట్టణంలో దాదాపుగా 16 భవనాలు కూలిపోయినట్లు టర్కిష్ మీడియా పేర్కొంది. శిథిలాల కింద చిక్కుకొని ఓ యువతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 29 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది కష్టపడుతున్నారు. ఫిబ్రవరి 2023లో సంభవించిన భూకంపం కారణంగా పురాతన నగరం ఆంటియోక్ ఉన్న అంటక్యలో 53,000 మంది చనిపోయారు. ఇటీవల జూలై ప్రారంభంలో అదే ప్రాంతంలో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఒకరు మరణించగా.. 69 మంది గాయపడ్డారు.

Exit mobile version