ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సీట్ల వివాదం కొనసాగుతుంది. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి పోటీ చేయాలని ఆయన అనుచర వర్గం ప్రత్యేకంగా రహస్య సమావేశం అయింది. ఇప్పటికే గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జలగం వెంకట్రావుకి అధిష్టానం ఈసారి సీట్లు ఇవ్వలేదు.. దీంతో ఇప్పటికే తుమ్మల అనుచర వర్గము అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Read Also: Chittoor Court: తల్లి బిడ్డల హత్య, మైనర్ కూతురిపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
తమ నాయకుడు తుమ్మల నాగేశ్వరావు సీటు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన అనుచర వర్గం వాపోతుంది. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలయపాలెం, కూసుమంచి మండలాల నుంచి తుమ్మల అనుచర వర్గం అంతా తరలివచ్చి ప్రత్యేకంగా రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని అయితే తుమ్మల పాలేరు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే మేమంతా గెలిపించుకుంటామని ఆయన అనుచరులు చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేయాలని ఏకవాక్య తీర్మానాన్ని అనుచర వర్గం చేసింది.
Read Also: Uttar Pradesh: నేను నా భర్తతో ఉండాలనుకుంటున్నాను.. నోయిడాలో బంగ్లాదేశ్ మహిళ
అయితే, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలు కావటంతో అక్కడ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కందాల ఉపేందర్రెడ్డి బీఆర్ఎస్ నాయకుడుగా చలామణి అవుతున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) ప్రకటించిన లిస్ట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. అయితే, ఇక్కడ నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆశపడ్డ తుమ్మల నాగేశ్వరావుకి నిరాశ ఎదురయింది.