Tummala Nageswara Rao: సామజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ భారత దేశం వ్యాప్తంగా పాదయాత్ర చేశారని.. సామాజిక విప్లవం కోసం మ్యానిఫెస్టోలో పెట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటా నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారన్నారు.. సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. సత్తుపల్లి పాత సెంటర్ నుంచి బస్టాండ్ సర్కిల్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
READ MORE: BSF :యుద్ధ విమానాన్ని స్టార్ హోటల్ గా మార్చనున్న ఉజ్జయిని బ్రదర్స్
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “చట్ట సభలో ఆమోదం తెలిపిన సాంకేతిక కారణాలతో అడ్డు తిరుగుతున్నారు. ప్రజా క్షేత్రంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి సాధించుకుంటాం.. బీజేపీ మెడలు వంచైన రిజర్వేషన్ తెచ్చుకుందాం.. గుజరాత్ లో బీసీ రిజర్వేషతోనే ప్రధాన మంత్రి పదవిని మోడీ దక్కించుకున్నారు.. చట్ట బద్దంగా చేసిన సవరణలను చూసి తెలంగాణకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేయాలని ప్రధానిని కోరుతున్నాం. బీసీలను నట్టేటా ముంచిన పార్టీ బీజేపీ. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ఓడిపోతుంది.. ఈ బంద్ లో బీజేపీ జెండాలు తప్ప అన్ని జెండాలు కనబడుతున్నాయి.. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ భూ స్థాపితం కానుంది.” అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
READ MORE: AP Crime: మారిపోయిన భూ యజమాని పేరు.. ఎమ్మార్వో ఎదుటే బాధితుడి ఆత్మహత్యాయత్నం..
