NTV Telugu Site icon

Tummala Nageswara Rao : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల

Tummala Nageswa Rao

Tummala Nageswa Rao

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వేలైన్లపై చర్చ జరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకమని, పట్టిసీమ టూ పులిచింతల లింక్ తో శ్రీశైలం నీళ్ళు రాయలసీమ సాగు నీటి కష్టాలు తీరుతాయి. తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు.

సత్తుపల్లి టూ కోవూరు రైల్వే లైన్, పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని తుమ్మల సూచన

రైల్వే లైన్ తో బొగ్గు రవాణా పుణ్య క్షేత్రాలు సందర్చించే భక్తులకు ప్రయోజనకరమని, కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయింది. ఏపిలో రైల్వే పై దృష్టి పెట్టాలని తుమ్మల సూచించనట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లా విడిపోయినా అభివృద్ధిలో కలసి సాగాలని ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు. జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందని, భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకత పై చంద్రబాబుకు మంత్రి తుమ్మల వివరించారు. తెలుగు రాష్ట్రాలు తల ఎత్తుకుని ఉండేలా అభివృద్ధి చెందాలని చంద్రబాబుతో ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల.. చంద్రబాబు నాయుడుతో ఎంతో ఆప్యాయత భేటీ సాగిందని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పై చర్చించామన్నారు.